7న తెరాస కార్యవర్గ సమావేశం.. కేటీఆర్ కోసమేనా ?
ఈ నెల 7న (ఆదివారం) తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటి సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, లోకసభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డిసిసిబి అధ్యక్షులు, డిసిఎంఎస్ అధ్యక్షులను ఆహ్వానించారు.
ఈ సమావేశంలో పార్టీ పరమైన అంశాలపై చర్చించనున్నారు. పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక, పార్టీ వార్షిక మహాసభ, ఇతర సంస్థాగత అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటారు. అయితే అతి త్వరలోనే మంత్రి కేటీఆర్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించనున్నారు. అది కూడా ఈ నెల 18నే అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెరాస కార్యవర్గ సమావేశం ప్రాధాన్యతని సంతరించుకుంది. ఈ సమావేశంలో కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయబోతున్నట్టు స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశాలున్నాయని సమాచారమ్.