బీజేపీలోకి నలుగురు తెరాస ఎమ్మెల్యేలు ?

అతి త్వరలోనే టీఆర్ఎస్ కు షాక్ తగలబోతున్నట్టు సమాచారమ్. నలుగురు తెరాస నేతలు అసంతృప్తితో ఉన్నారు. వారు బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వీరిలో సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా ఉన్నారట. ఆయనతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చర్చలు జరిపారని చెప్పుకుంటున్నారు. బండికి కండియం దాదాపు ఓకే చెప్పేశారని.. అతి త్వరలోనే ఆయన కమలతీర్థం పుచ్చుకోవడం ఖాయం అంటున్నారు. కడియంతో పాటు మరో ముగ్గురు తెరాస నేతలు కూడా కారు దిగి కమలం పట్టుకోబోతున్నట్టు తెలుస్తోంది.

దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికలతో తెరాసకు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే విషయం స్పష్టం అయింది. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అనే టాక్ ఇప్పటి నుంచే నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే తెరాస నుంచి బీజేపీలో వలసలు మొదలైతే.. అవి ఆగకుండా 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు సాగే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నరు. తెరాసలో అసంతృప్తుల జాబితా పెద్దదే. కాకపోతే.. ఇప్పుడు ఎన్నికల్లేవ్. పార్టీ నుంచి జంప్ కావాల్సిన పనిలేదని ఆగుతున్నట్టు చెప్పుకుంటున్నారు.