సూర్యకు కరోనా పాజిటివ్

ఏకంగా యేడాది కాలం పాటు కరోనా మహమ్మారి వణికించింది. సామాన్యులు.. సెలబ్రీటీలు అందరికీ సోకింది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్.. చెందిన పలువురు సినీ ప్రముఖులు కరోనా బారినపడ్డారు. కోలుకున్నారు. అయితే ఇప్పుడు కరోనా భయం దాదాపు పోయింది. దేశంలో కరోనా కేసులు తగ్గడంతో పాటు వాక్సిన్ కూడా రావడంతో ప్రజల్లో ధైర్యం వచ్చింది. అయితే ఇలాంటి టైమ్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కరోనా బారినపడ్డారు.ఈ విషయాన్ని స్వయంగా సూర్యనే తెలిపారు.

“నేను కరోనాతో బాధపడుతున్నాను. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాను. మన జీవితాలు కరోనా నుంచి ఇంకా బయటపడలేదు. అలాగని భయపడవద్దు. కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా నుంచి కోలుకోవడానికి కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు” అని సూర్య ట్విట్ చేసారు. దీంతో ఆయన అభిమానులు కంగారుపడుతున్నారు. సూర్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. సినీ ప్రముఖులు, ప్రేక్షకులు ట్విట్ చేస్తున్నారు. దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.