పంత్ మెరుపులే.. కానీ !
రిషబ్ పంత్ ప్రతిభగల ఆటగాడు. కానీ ఆటని అర్థం చేసుకోడు. జట్టు ఏ పరిస్థితుల్లో ఉందో అస్సలు పట్టించుకోడు. నిర్లక్ష్యంగా ఆడతాడు. అనవసరంగా వికెట్ పారేసుకుంటాడనే విమర్శలున్నాయ్. తాజాగా ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టులోనూ.. అలాంటి విమర్శలు చేసే వారికి పంత్ మరో అవకాశం ఇచ్చినట్టయింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 578 భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు కెప్టెన్ జో రూ డబుల్ సెంచరీ బాదాడు.
ఇక తొలి ఇన్నింగ్స్ లో టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది.19 పరుగుల వద్ద రోహిత్ (6; 9 బంతుల్లో, 1×4) ఆర్చర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. శుభ్‌మన్ గిల్ (29; 28 బంతుల్లో, 5×4) భారీ స్కోర్ చేయలేకపోయాడు. కెప్టెన్ కోహ్లీ (11), వైఎస్ కెప్టెన్ రహానె (1) తీవ్రంగా నిరాశపరిచారు. ఇలాంటి టైమ్ లో నయావాల్ పుజారా(73) తో కలిసి పంత్ (91)జట్టుని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పంత్ దూకుడుగా ఆడాడు. వన్ డే తరహా 88 బంతుల్లోనే 91 పరుగులు చేశాడు. కానీ జట్టు ఏ పరిస్థితుల్లో ఉందో
అర్థంచేసుకోకుండా భారీ షాట్ కి వెళ్లి అవుటయ్యాడు. పంత్ ఇంకాస్త నెమ్మదిగా ఆడి.. ఇంకాసేపు క్రీజులో ఉంటే పరిస్థితి వేరే ఉండేదని విశ్లేషకులు అంటున్నారు.
ఇక ప్రస్తుతం టీమిండియాకష్టాల్లో ఉంది. 8 వికెట్లు కోల్పోయి 328 పరుగులతో ఆటని కొనసాగిస్తోంది. ప్రస్తుతం క్రీజులో సుందర్ 71, ఇషాంత్ శర్మ 4 పరుగులతో ఉన్నారు. టీమిండియా ఇంకా 255 పరుగులు వెనకబడి ఉంది. ఇకపై టీమిండియా పట్టుదలతో ఆడితే మ్యాచ్ డ్రాగా ముగిసే ఛాన్స్ ఉంది. లేదంటే ఇంగ్లండ్ గెలిచే ఛాన్స్ ఉంది.