గోవాలో.. అరియాతో ఆర్జీవి !
బిగ్ బాస్ ఫేమ్ అరియానాతో ఆర్జీవి గోవాలాలో ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్దరు కలిసి దిగిన ఫోటోని అరియానా తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అయితే అక్కడ ఏం చేస్తున్నది పేర్కొనలేదు. పర్సనల్ పనా… సినిమాలకు సంబంధించినదా ? అన్నది చెప్పలేదు. దీంతో ఎవ్వరికి తోచిన కథలు వాళ్లు అల్లుకుంటున్నారు. అందాలని ఆస్వాదించే అలవాటున్న ఆర్జీవి కొత్త అందాన్ని పట్టాడనే కామెంట్స్ కూడా చేస్తున్నారు.
వాస్తవానికి ఆర్జీవిని ఇంటర్వ్యూ చేయడంతోనే అరియానా వెలుగులోకి వచ్చింది. ఇంటర్వ్యూలో అరియానాపై ఆర్జీవీ రొమాంటిక్ కామెంట్స్ చేయడం.. అవి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అవే ఆమెకు బిగ్ బాస్ ఆఫర్ ని తెచ్చిపెట్టాయ్. ఇక బిగ్ బాస్ ఇంట్లో అరియానా బోల్డ్ బ్యూటీ అనిపించుకుంది. ముక్కుసూటిగా మాట్లాడుతూ.. వ్యవహరిస్తూ బిగ్ బాస్ టాప్ 4గా నిలిచింది. ఇక బిగ్ బాస్ తర్వాత ఈ బ్యూటీకి ఆఫర్లు క్యూ కడుతున్నాయని సమాచారమ్.