గిల్ హాఫ్ సెంచరీ.. అవుట్ !

టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ కాన్ఫిడెంట్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఈజీగా హాఫ్ సెంచరీలు చేస్తున్నాడు. కానీ వాటిని భారీస్కోర్ గా మాత్రం మలచలేకపోతున్నాడు. చెన్నై టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో గిల్ (50 83 బంతుల్లో) పూర్తి చేశాడు. ఆ వెంటనే అవుటయ్యాడు. అండర్సన్  బౌలింగ్ లో బోల్డ్ అయ్యాడు. ప్రస్తుతం టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 92 పరుగులతో ఆటని కొనసాగితోంది. క్రీజులో కెప్టెన్ కోహ్లీ (10), వైస్ కెప్టెన్ రెహానె(0) ఉన్నారు. మ్యాచ్ ని డ్రా చేయడం లేదా గెలిపించడం అన్నది వీరి చేతిలోనే ఉందని చెప్పవచ్చు.

చెన్నై టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 578 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీమిండియా మాత్రం తొలి ఇన్నింగ్స్ లో 337 పరుగులే చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 241 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే రెండో ఇన్నింగ్స్ లో మాత్రం ఇంగ్లండ్ ని 178 పరుగులకే కట్టడి చేశారు. స్పిన్నర్ అశ్విన్ ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో టీమిండియా విజయలక్ష్యం 420గా మారింది. నాల్గోరోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా రోహిత్ శర్మ (12) వికెట్ కోల్పోయి 39 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఆఖరిరోజు  టీమిండియా విజయానికి 381 పరుగులు అవసరం.