చెన్నై టెస్ట్ లో భారత్ ఓటమి
చెన్నై టెస్ట్ లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. 420 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ 227 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. భారత బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ(72; 104 బంతుల్లో 9×4), శుభ్‌మన్‌గిల్(50; 83 బంతుల్లో 7×4, 1×6) అర్ధశతకాలు సాధించి టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సర్ 3/17, లీచ్ 4/76 అద్భుత బౌలింగ్ చేశారు.
ఐదోరోజు తొలి సెషన్ లో టీమిండియా ఓటమి దాదాపు ఖరారైంది. వికెట్ నష్టానికి 39 పరుగులతో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియాను ఇంగ్లండ్ పేస్ బౌలర్ అండర్సన్ దెబ్బతీశాడు. పుజారా (15), రహానే (0), పంత్ (11), సుందర్ (0) తీవ్రంగా నిరాశపరిచారు.లంచ్ సమయానికి టీమిండియా 6 వికెట్లకు 144 పరుగులు చేసింది. ఆ తర్వాత అశ్విన్ (9)తో కలిసి కోహ్లి కాసేపు పోరాడినా ఫలితం లేకపోయింది. ముందు అశ్విన్, ఆ వెంటనే స్టోక్స్ బౌలింగ్‌లో అనూహ్యమైన లో బౌన్స్‌కు కోహ్లి బోల్తా కొట్టడంతో టీమ్ ఆశలు గల్లంతయ్యాయి.
స్కోర్ బోర్డు వివరాలు :
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 578 ఆలౌట్.. జోరూట్ 218, బుమ్రా 3/84
భారత్ తొలి ఇన్నింగ్స్ : 337 ఆలౌట్.. పంత్ 91, బెస్ 4/76
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : 178 ఆలౌట్.. అశ్విన్ 6/61
భారత్ రెండో ఇన్నింగ్స్ : 192 ఆలౌట్.. లీచ్ 4/76