వెంకయ్యకు క్షమాపణలు చెప్పిన విజయసాయి

“ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారు. మనిషి ఒకచోట… ఆయన మనసు మరోచోట ఉంది” అని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సభలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన మాటలతో వెంకయ్య నొచ్చుకున్నారు. ఇతర పార్టీలు నేతలు సైతం విజయసాయి మాటలు సరికావని.. ఆయన క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి మంగళవారం ఉదయం రాజ్యసభలో వివరణ ఇచ్చారు. ” రాజ్యసభ ఛైర్మన్‌పై వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా. వెంకయ్యనాయుడిపై నా వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నా. మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటా. ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు కాదు, ఆవేశంలో మాట్లాడా. రాజ్యసభ ఛైర్మన్‌ను అగౌరవ పరచాలనుకోలేదు” అని ప్రకటించారు.