కర్ణాటక.. ముఖ్యమంత్రిగా పవన్ !

కర్ణాటక ఫలితాలు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ని ముఖ్యమంత్రిని చేశాయి. కర్ణాటకలో ఏ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించలేకపోయిన సంగతి తెలిసిందే. భాజాపా 104 స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 78, జేడీఎస్ 38 స్థానాలని కైవసం చేసుకొంది. ఐతే, మూడో ర్యాంకులో నిలిచిన జేడీఎస్.. సెకండ్ ర్యాంకర్ కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. జేడీఎస్ నేత కుమర స్వామి కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా దాదాపు ఖరారైందని చెబుతున్నారు.

కర్ణాటక ఫలితం తెలుగు రాష్ట్రం ఏపీని ప్రభావితం చేస్తున్నట్టు కనబడుతోంది. ఏపీలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే సాధారణ ఎన్నికల్లో కింగ్ మేకర్ గా అవతరిస్తారని సోషల్ మీడియా వేదిక చర్చ మొదలైంది. కర్ణాటక ఎన్నికల్లో త్రిముఖ పోటి కనిపించింది. భాజాపా, కాంగ్రెస్, జేడీఎస్ ఎన్నికల యుద్ధంలో పోటీపడ్డాయి. ఇప్పుడు ఏపీలోనూ ఇదే వాతావరణం కనబడుతోంది. రాబోయే సాధారణ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, జనసేనల మధ్య గట్టిపోటి ఉండనుంది. ఈ మూడు పార్టీలో వైసీపీ, టీడీపీలలో ఒక పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినా.. ప్రభుత్వ ఏర్పాటుకు జనసేన మద్దతు కచ్చితంగా అవసరమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ లెక్కన పవన్ సీఎం కావడం ఖాయం. ఇందుకు కర్ణాటక ఫలితాలే చక్కని ఉదాహరణ అని చెప్పుకొంటున్నారు. కర్ణాటకలో మూడో ర్యాంకు తెచ్చుకొన్న జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఏపీలోనూ సేమ్ సీన్ రిపీట్ కానుంది. జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని.. పవన్ ఫ్యాన్స్, జనసేన శ్రేణులు సంబరపడిపోతున్నారు. ఏపీకి కర్ణాటక లాజిక్ ని అప్లై చేస్తే ఇదీ నిజమే.. మరీ.