20న ఖమ్మం జిల్లా నేతలతో షర్మిల మీటింగ్
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని ప్రకటించిన వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై వడివడిగా అడుగులు వేస్తోంది. కొత్త పార్టీ ఏర్పాటు, కార్యచరణపై బుధవారం ముఖ్యనేతలతో షర్మిల సమావేశం అయ్యారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక ఈ నెల 20న ఖమ్మం జిల్లా నేతలతో షర్మిల సమావేశం కానున్నారు. ఇలా అన్నీ జిల్లాల నేతలతో సమావేశాలు ముగిశాక.. పార్టీ ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.
మరోవైపు షర్మిల కొత్త పార్టీ ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు వెనక బీజేపీ, తెరాస ఉన్నాయని కాంగ్రెస్ నేతలు, షర్మిల వెనక ఉందని భాజాపా ఉందని తెరాస నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ జనాలు మాత్రం షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. తెలంగాణపై ఆంధ్రా నేతల పెత్తనం అవసరం లేదంటున్నారు.