టీ20, టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకొనే టైమొచ్చిందా ?
మూడు ఫార్మెట్లకు (టీ20, వన్డే, టెస్ట్) టీమిండియా సింగిల్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ వ్యవహరిస్తున్నారు. ఇప్పుడీ.. ఈ మూడు ఫార్మెట్లలో
రెండింటి (టీ20, టెస్ట్) నుంచి కోహ్లీ తప్పుకొనే టైమ్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. టీ20ల్లో కోహ్లీ కంటే రోహిత్ శర్మ బెస్ట్ కెప్టెన్ అని ఇప్పటికే తేలిపోయింది. ఐపీఎల్ లో రోహిత్ సారధ్యంలోని ముంబై ఇండియన్స్ అత్యధిక సార్లు ట్రోఫిని గెలుచుకుంది. ఇక కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోపీని అందుకోలేదు. ఇక టెస్టు కెప్టెన్ గా రెహానె నిరూపించుకున్నారు. కోహ్లీ, కోహ్లీ లేకున్నా… ఆసీస్ గడ్డపై ఆ జట్టుని ఓడించి టైటిల్ ని గెలిచారు.
న్యూజిలాండ్ పర్యటనలో రెండు టెస్టులు, ఆసీస్ పర్యటనలో అడిలైడ్ వేదికగా సాగిన టెస్ట్ లో ఓటమి తరువాత కోహ్లీ ఇండియాకు వచ్చేసిన సంగతి తెలిసిందే. కోహ్లీ జట్టును వీడిన తరువాత, భారత జట్టు అద్భుత పోరాట పటిమను ప్రదర్శించి, ఆసీస్ తో సిరీస్ ను నెగ్గడం ద్వారా బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీని మరోమారు సాధించింది. ఇక చెన్నై టెస్టులో ఇంగ్లండ్ చేతిలో ఓటమి తర్వాత కోహ్లీని సీనియర్ ఆటగాళ్లు, నెటిజన్స్ కడిగేస్తున్నారు. కోహ్లీని వన్డే జట్టుకు మాత్రమే పరిమితం చేసి.. టీ20 కెప్టెన్ బాధ్యతలని రోహిత్ కు, టెస్ట్ బాధ్యతలని రెహానెకు అప్పగించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే కోహ్లీ కెప్టెన్ బాధ్యతలని ట్రిప్ చేయనున్నారా ? అనే చర్చ మొదలైంది.