నల్గొండ జిల్లాకు కేసీఆర్ వరాల జల్లు
నల్గొండ జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ హాలియా బహిరంగసభలో మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ వీరుల పార్టీ. వీపు చూపే పార్టీ కాదన్నారు. ఇక నల్గొండ జిల్లాపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. నల్గొండ జిల్లాలోని 844 గ్రామ పంచాయతీలున్నాయి. ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 20 లక్షలు ఇస్తాం. ప్రతి మండల కేంద్రానికి రూ. 30 లక్షలు ఇస్తాం. మిర్యాలగూడ మున్సిపాలిటికి రూ. 5కోట్లు ఇస్తాం. రేపే ఈ చెక్కులు మంజూరు చేస్తామన్నారు.
ఇటీవల భాజాపా నేతలు చేసిన కామెంట్స్ పై కూడా సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ మధ్య భాజాపా నేతలు మాటలు మాట్లాడుతున్నారు. అదుపులో పెట్టుకోండి. మా సహనం నశిస్తే.. దుమ్ము దుమ్మే అన్నారు. ఇక కేసీఆర్ మాట్లాడుతున్న సమయంలో ఒకరిద్దరు నిరసన తెలియజేసే ప్రయత్నం చేసారు. ఇలాంటి కుక్కు మెరుగుతూనే ఉంటాయని.. వారిని బయటికి పంపించాలని కేసీఆర్ పోలీసులని కోరారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పేరుని కూడా ఉచ్చరించే హక్కులేదన్నారు కేసీఆర్. మొత్తానికి.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రసంగం సాగుతోంది.