మహేష్ రిటర్న్ గిఫ్ట్
సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రతకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. రిటర్న్ గిఫ్ట్ అనడం కంటే.. రిటర్న్ కిస్ అనడం బెటరేమో. మహేష్-నమ్రతల పెళ్లిరోజు నేడు. ఈ సందర్భంగా భర్త మహేష్ బాబుకు ముద్దుపెడుతున్న ఫోటోని నమ్రత తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. స్వీట్ విషెస్ తెలిపింది.
‘వివాహం తరువాత 16 సంవత్సరాలు ఎంతో వేగంగా గడిచాయి. బలమైన ప్రేమతో పాటు నమ్మకాల కలయికతో మన వైవాహిక జీవితం రూపుదిద్దుకుంది. నిన్ను మరింత ఎక్కువగా ప్రేమిస్తున్నాను. హ్యాపీ మ్యారేజ్ డే’ ని రాసుకొచ్చింది. దీనికి రిటర్న్ గిఫ్ట్ అన్నట్టుగా నమ్రతకు ముద్దుపెడుతున్న ఫోటోని మహేశ్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇప్పుడీ.. ఈ రెండు ఫోటోలని పక్కపక్కనే ఉంచి మహేష్ అభిమానులు వైరల్ చేస్తున్నారు.
ప్రస్తుతం మహేష్ ‘సర్కారు వారి పాట’ తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. మహేష్ కి జంటగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది. ఇటీవల షూటింగ్ స్పాట్ కు సంబంధించిన ఫోటోలని మహేష్ షేర్ చేసిన సంగతి తెలిసిందే.