కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడా ?
కోహ్లీ సారథ్యంలో గత నాలుగు టెస్టుల్లో భారత్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. గతేడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో ఆ జట్టుతో జరిగిన రెండు టెస్టుల్లో ఓటమిపాలైంది. ఇక డిసెంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాభవం పాలైంది. ఇప్పుడు తాజాగా ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులోనూ ఓటమిచెందింది. ఈ నేపథ్యంలోనే కోహ్లీ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
అదే సమయంలో కెప్టెన్‌గా అజింక్య రహానె అద్భుత ప్రదర్శన చేశాడు. కాబట్టి టీమ్ఇండియా సారథి ఇప్పుడు మరింత ఒత్తిడికి గురవుతుంటాడు. తర్వాతి మ్యాచ్‌లోనూ భారత జట్టు ఓటమిపాలైతే కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడేమో’ అని ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ అన్నారు.