గల్వాన్ ఘర్షణ : 45మంది చైనా జవాన్ల మృతి
తూర్పు లద్దాఖ్‌లో గతేడాది భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీర మరణం చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘర్షణలో ఎంతమంది చైనా సైనికులు మరణించారన్న విషయాన్ని అక్కడి పీఎల్ఏ ప్రభుత్వం వెల్లడించలేదు.
తాజాగా ఆ వాక్యాన్ని రష్యా అధికార మీడియా ఏజెన్సీ టాస్ తెలిపింది. భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 45మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. మరోవైపు భారత్-చైనా దేశాల సరిహద్దుల మధ్య తొమ్మిది నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభనకు తెరదించుతూ ఇరు దేశాల బలగాలను ఉపసంహరణ ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. దీనిపై బుధవారం పార్లమెంట్ లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేశారు. చైనాకు అంగుళం భూమి కూడా వదిలేది లేదని రాజ్ నాథ్ అన్నారు.