ట్విట్టర్ రివ్యూ : ‘ఉప్పెన’ – బ్లాక్ బస్టర్
కొన్ని సినిమాలకు రిలీజ్ కు ముందే హిట్ టాక్ వస్తుంటుంది. అది నిజం అవుతుంది కూడా. ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలకు ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే కొత్త దర్శకుడు, కొత్త హీరో-హీరోయిన్ సినిమాకు కూడా రిలీజ్ కి ముందే బ్లాక్ బస్టర్ హిట్ రావడం చాలా అరుదు. ఇప్పుడు ‘ఉప్పెన’ విషయంలో ఇదే జరిగింది. మెగాస్టార్ అల్లుడు వైష్ణవ్ తేజ్ తెరంగేట్రం చేస్తున్న చిత్రమిది. కృతీ శెట్టి హీరోయిన్. ఈమెకు ఇదే తొలి సినిమా. కొత్త దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. అందరూ కొత్తవాళ్లే అయినా.. వీరి వెనక మాత్రం స్టార్స్ ఉన్నారు. పెద్ద అనుభవం ఉంది. మైత్రీ మూవీస్ నిర్మించింది.
బుచ్చిబాబు.. దర్శకుడు సుకుమార్ శిష్యుడు. సుక్కు పర్యవేక్షణలోనే ఉప్పెన తెరకెక్కింది. ఆయన సూచనలతో కొన్ని సీన్స్ రీ-షూట్ చేశారు. స్క్రీన్ ప్లేని షార్ప్ చేశారు. ఇక సినిమా ప్రమోషన్స్ సూపర్భ్ గా ప్లాన్ చేశారు. ఓ స్టార్ హీరో సినిమా వస్తుందన్న భావన కలిగించారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, ఎన్ టీఆర్.. ఇలా ప్రతి ఒక్కరు ఉప్పెనని మోశారు. ప్రమోట్ చేశారు. ఫైనల్ గా భారీ అంచనాల మధ్య ఉప్పెన ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే బినిఫిట్ షోస్ పడిపోయాయ్. దీంతో సినిమా టాక్ ని ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. ఆ విశేషాలపై ఓ లుక్కేద్దాం పదండీ.. !
వన్ సైడ్ గా ఉప్పెనకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. వైష్ణవ్ తేజ్-కృతి శెట్టి జంట బాగుంది. బాగా నటించారు. వీరిద్దరు తొలి సినిమా చేస్తున్నట్టుగా కనిపించలేదు. నటనలో కాస్త అనుభవం ఉన్నవాళ్లలా కనిపించారని ట్విట్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఆయన పాత్రలో లీనమై నటించారు. ఆఖరి 20 నిమిషాలు సినిమా అదిరిపోయిందని చెబుతున్నారు. అయితే తొలి భాగం చాలా బాగా నడిపించిన దర్శకుడు.. సెకాంఢాఫ్ లో మాత్రం కాస్త డ్రాగ్ అయినట్టు కనిపించింది. క్లైమాక్స్ లో మాత్రం గుండెల్ని పిండేసేలా తెరకెక్కించారని చెబుతున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు బాగున్నాయి. వాటిని తెరపై చూడ్డానికి ఇంకా బాగున్నాయని కామెంట్ చేస్తున్నారు. దేవిశ్రీ అందించిన నేపథ్య సంగీతం అదిరిపోయిందని చెబుతున్నారు. సినిమా చాలా కాస్ట్లీగా ఉంది. స్క్రీన్ ప్లే బాగుందని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్ కృతిసనన్ కళ్లతోనే నటించేసింది. ఆమె తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వడం గ్యారెంటీ అని సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. విజయ్ సేతుపతి ఈ సినిమాకు విలన్ కాదు. హీరో. సినిమాని నిలబెట్టారుని ట్విట్స్ చేస్తున్నారు. మొత్తానికి.. ఉప్పెనపై వన్ సైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ అనే టాక్ నడుస్తోంది.
#Uppena First Half : Both the lead pair did extremely well, all the three songs shot beautifully, VJS has limited screen presence and as usual, he did his part well. VFX could’ve been better. Buchi Babu writing and direction are top notch. So far, very good!!!
— Aakashavaani (@TheAakashavaani) February 12, 2021
Congratulations Team #Uppena
Positive Talk Everywhere.. 🤩BLOCKBUSTER ❤
Day 1 Debut Records Out For Sure !!🏌#BlockbusterUppena 💥
— Nithin PSPK Cult ™ (@NithinPSPKCult) February 12, 2021
H I T #Uppena
2nd Half BANG ON #BuchiBabu Direction 👌👌👌👌— Anju Tarakian (@AnjuNaik9999) February 12, 2021
Good watch with an excellent ending
2nd half lo kastha drag ina kuda, Last 20-30 minutes 👌
Heroine – Father scene in climax 👊
Lead Cast performances 👍👌@VijaySethuOffl mass characterization & Screen Presence 💥 Interval Dialogue 🔥@ThisIsDSP 👏@BuchiBabuSana 👍#Uppena— PA1😎 (@PA1akhil) February 12, 2021
#Uppena Public Talk
Vaishnav Tej Acting is Far Better than Debut Actor
DSP music ayithe ❤️💥
**Vijay Sethuapthi Acting and Base voice in theatre🔥 @BuchiBabuSana Did Well with Debut
Final Ga Positive Talk 🙌
— Pawan Kalyan™ (@Chandu_Royal9) February 12, 2021
#Uppena First Half Good And Second Half Brilliant and Climax was Too Emotional And @VijaySethuOffl Acting @IamKrithiShetty @ThisIsDSP Music Rocks 🔥 and My Review 3.75/5 🔥🔥🔥
— CHANDU (@GREATCHANDU1) February 12, 2021