‘రాధేశ్యామ్’ వాలంటైన్ డే గ్లింప్స్.. టైమ్ ఫిక్స్ !
ప్రభాస్ అభిమానులకి గుడ్ న్యూస్. ప్రభాస్ నుంచి వాలంటైన్ డే గిఫ్ట్ రాబోతుంది. రాథేశ్యామ్ టీజర్ వస్తుందని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. కానీ ఆరోజున గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ యూవీ క్రియేషన్స్ కొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ప్రేమికులరోజు కానుకగా ఫిబ్రవరి 14న ఉదయం 09:18 నిమిషాలకు రాధేశ్యామ్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇందులో ప్రభాస్ స్మార్ట్ గా కనిపిస్తున్నారు. ప్రేమలో మునిగిపోయి.. దాన్ని ఆస్వాదిస్తున్న లుక్ ని రిలీజ్ చేశారు.
ఈ చిత్రానికి రాథాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ కి జంటగా పూజాహెగ్డే నటిస్తోంది. ఇదో పిరియాడిక్ లవ్ స్టోరీ. ఒక స్వచ్ఛమైన ప్రేమ కథలా దర్శకుడు రాధాకృష్ణ సినిమాను చాలా రొమాంటిక్ గా తెరకెక్కిస్తున్నాడట. యూరప్ నేపథ్యంలో పునర్జన్మల ప్రేమకథగా రాధేశ్యామ్ తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో రాధేశ్యామ్ పై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేయబోతున్న సంగతి తెలిసిందే. సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలని చేయనున్నారు.
Love is in the air!
Get ready to get a glimpse of #RadheShyam on 14th Feb at 9.18 AM!#14FebWithRS
Starring #Prabhas & @hegdepooja pic.twitter.com/RfwH06WB92
— UV Creations (@UV_Creations) February 12, 2021