అఫిషియల్ : శంకర్ దర్శకత్వంలో #RC15

TSMirchi ముందే చెప్పినట్టు… శంకర్-రామ్ చరణ్-దిల్ రాజుల కాంబోలో సినిమా ఫిక్సయింది. ఈ మేరకు దిల్ రాజు బ్యానర్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని గ్రేట్ దర్శకుడు శంకర్ కూడా ధృవీకరించారు. రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించడం ఆనందంగా ఉందని శంకర్ ట్విట్ చేశారు.

రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత సినిమా కోసం జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్నమూరి, లోకేష్ కనగరాజు, శంకర్ పేర్లు వినిపించాయి. తాజాగా శంకర్ తో చరణ్ సినిమా ఫిక్సయింది. పాన్ ఇండియా సినిమాగా ఇది తెరకెక్కనుంది. మొదటి నుంచి యూనివర్సల్ కథతో శంకర్ సినిమాలు తీస్తుంటాడు. సామాజిక సృహాతో.. టెక్నికల్ గా ఆయన సినిమా రిచ్ గా ఉంటాయ్. మరీ.. రామ్ చరణ్ కోసం శంకర్ ఎలాంటి కథని రెడీ చేసుకున్నారు అన్నది  ఇప్పుడు ఆసక్తిగా మారింది.

వాస్తవానికి శంకర్-దిల్ రాజు కాంబోలో భారతీయుడు 2 సినిమా రావాల్సి ఉంది. ఈ చిత్రానికి మొదట దిల్ రాజునే నిర్మాతగా ఫిక్సయ్యాడు. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి దిల్ రాజు తప్పుకున్నారు. దీంతో రోబో నిర్మాతలు భారతీయుడు 2 ని టేకప్ చేశారు. అయితే భారతీయుడు సెట్ లో భారీ ప్రమాదం కారణంగా ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో కొత్త సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు శంకర్ రెడీ అవుతున్నారు. తాజాగా రామ్ చరణ్ తో సినిమాని ప్రకటించారు.