‘ఉప్పెన’ తొలిరోజు కలెక్షన్స్

టాలీవుడ్ కు ‘ఉప్పెన’ కళ తెచ్చింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్-కృతీ సనన్ జంటగా నటించిన చిత్రమిది. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మైత్రీ మూవీస్ నిర్మించింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల  ముందుకొచ్చిన ఉప్పెన హిట్ టాక్ తెచ్చుకొంది. ఆ రేంజ్ లోనే తొలిరోజు కలెక్షన్స్ కూడా ఉన్నారు. దాదాపు రూ. 10కోట్ల వసూలు రాబట్టింది.

ఏరియాల వారీగా ఉప్పెన తొలిరోజు కలెక్షన్స్ చూస్తే..

* నైజాం – రూ. 3.08 కోట్లు

* వైజాగ్ – రూ. 1.43 కోట్లు

* సీడెడ్ – రూ. 1.35 కోట్లు

* ఈస్ట్ – రూ. 0.98 కోట్లు

* వెస్ట్ – రూ. 0.81 కోట్లు

* కృష్ణ – రూ. 0.62 కోట్లు

* గుంటూరు – రూ. 0.65 కోట్లు

* నెల్లూరు – రూ. 0.35 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.