రౌడీ కొత్త ఫోటోస్.. వైరల్ !


రౌడీ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘లైగర్’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ తెరకెక్కుతోంది. అనన్య పాండే హీరోయిన్. పూరీ జగన్నాథ్, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

సెప్టెంబర్ 9న లైగర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెడ్ స్పీడుతో జరుగుతోంది. షూటింగ్ లో భాగంగా క్యారవాన్ లో తీసుకున్న ఫోటోలని విజయ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. రౌడీ లుక్, స్మైల్ అదిరిపోయింది. ఇప్పుడీ.. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఫైటర్  తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో బోల్డ్ నటనతో టాలీవుడ్ సంచలనంగా మారాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు లైగర్ సినిమాతో బాలీవుడ్ షేక్ చేయడం ఖాయం. టాలీవుడ్ నుంచి రాబోతున్నమరో పాన్ ఇండియా హీరో విజయ్ నే అని చెప్పుకుంటున్నారు.