‘రాధేశ్యామ్’ టీజర్.. అదిరిపోయింది !


ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాధేశ్యామ్ టీజర్ వచ్చేసింది. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తాజాగా ‘రాధేశ్యామ్‌’ టీజర్‌ను విడుదల చేశారు. ‘నువ్వు ఏమైనా రోమియో అనుకుంటున్నావా?’ అని పూజా ప్రశ్నించగా.. ‘ఛ.. వాడు ప్రేమ కోసం చచ్చాడు. నేను ఆ టైప్‌ కాదు’ అంటూ ప్రభాస్‌ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకునేలా ఉంది. జులై 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఈ చిత్రానికి కె.రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ లవర్‌బాయ్‌గా సాఫ్ట్‌ లుక్‌లో విక్రమాదిత్య అనే పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్‌కు జోడీగా పూజాహెగ్డే.. ప్రేరణగా మెప్పించనున్నారు. పాన్‌ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి దక్షిణాదిలో జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలు అందిస్తుండగా.. హిందీలో మిథున్‌, మనన్‌ భరద్వాజ్‌ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తోంది.