కీర్తి సురేష్.. అతడికి ఎలా పడిపోయింది !?


త్వరలోనే హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి. కోలీవుడ్ సంగీత సంచలనం అనిరుధ్ ని పెళ్లాడనుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అనిరుధ్ తో కీర్తి సన్నిహితంగా ఉన్న రెండు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరోనా లాక్‌డౌన్ ముందు నుంచే కీర్తి సురేష్ పెళ్లికి రెడీ అవుతోంది. త్వరలోనే పెళ్లి చేసుకోనుందనే వార్తలు వినిపించాయి. కానీ అనిరుధ్ తో ప్రేమ వ్యవహారం అనే మేటర్ ఎక్కడా లీక్ కాలేదు.

ప్రేమ వ్యవహారాలు నడపడంలో అనిరుధ్ ఘనుడు. లైవ్ లో హీరోయిన్స్ పెదాలని జుర్రేసుకొన్న ఘటనలు. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలున్నాయి. అయితే కీర్తి సురేష్ తో ప్రేమని మాత్రం అతడు పబ్లిక్ చేయలేదు. వీరిద్దరు ప్రేమలో ఉన్నట్టు ఎక్కడా లీకు రాలేదు. అందుకే అనిరుధ్ కి కీర్తి ఎలా పడింది ? అనే కూడా సాగుతోంది.

బహుశా.. నిజంగా వీరిద్దరు పెళ్లి చేసుకుంటే.. ? ఆ తర్వాత వీరి ప్రేమ ముచ్చట్లు ప్రేక్షకులకి తెలిసే ఛాన్స్ ఉంది.  
కీర్తి సురేశ్‌ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ‘గుడ్‌లక్‌ సఖి’, ‘రంగ్‌దే’, ‘సర్కారు వారి పాట’ చిత్రాలతోపాటు మరికొన్ని మలయాళీ, తమిళ సినిమాలు కీర్తి చేతిలో ఉన్నాయి. ‘సర్కారువారి పాట’ షూట్‌ కోసం దుబాయ్‌కు వెళ్లిన కీర్తి ఇటీవల ఇంటికి చేరుకున్నారు.