మెహ్రీన్ పెళ్లి ప్రకటన వచ్చేసింది !
హీరోయిన్ మెహ్రీన్ పెళ్లి ఫిక్సయింది. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ భిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్ ని మెహ్రీన్ పెళ్లాడనుంది. త్వరలోనే వీరి నిశ్చితార్థ వేడుక జరగనుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రచారంపై మెహ్రీన్ స్పందించింది. తన పెళ్లి గురించి వస్తోన్న వార్తలు నిజమేనని తెలిపింది.
వచ్చే నెలలో నిశ్చితార్థం జరగనుంది. జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభమవుతోన్నందుకు తాను ఎంతో సంతోషంగా ఉన్నానని మెహ్రీన్ తెలిపింది. రాజస్థాన్‌లోని జైపుర్ అలీలా కోటలో మార్చి 13న వీరిద్దరి నిశ్చితార్థ వేడుక జరగనుంది.
‘కృష్ణగాడి వీరప్రేమగాథ’తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ దాదాపు 17 తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె ‘ఎఫ్2’కు కొనసాగింపుగా అనిల్‌రావిపూడి తెరకెక్కిస్తోన్న ‘ఎఫ్3’లో నటిస్తోంది.