‘అ’ది త్రివిక్రమ్ సెంటిమెంట్ !
‘అ’ది త్రివిక్రమ్ సెంటిమెంట్’గా మారింది. ఆయన సినిమాల టైటిల్స్ ‘అ’తో మొదలయ్యేలా చూసుకొంటున్నారు. అతడు, అత్తారింటికి దారేది, అ ఆ, అజ్ఞాతవాసి టైటిల్స్ అ సెంటిమెంట్’లోంచి పుట్టికొచ్చినవే. వీటిలో ‘అజ్ఝాతవాసి’ తప్ప మిగిలిన మూడు సినిమాలు ప్రేక్షకులని ఆకట్టుకొన్నాయి. త్రివిక్రమ్ మార్క్ సినిమాలుగా నిలిచాయి. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కోసం మరోసారి ‘అ’ సెంటిమెంట్ నే ఫాలో అయ్యాడు త్రివిక్రమ్. ‘అరవింద సమేత’ టైటిల్’ని ఫిక్స్ చేశారు. ‘వీర రాఘవ’ అనేది ట్యాగ్ లైన్.
ఆదివారం (మే 20) తారక్ పుట్టినరోజు కానుకగా ‘అరవింద సమేత’ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. సినిమా టైటిల్, సినిమాలో ఎన్టీఆర్ లుక్ పాజిటివ్ టాక్ వినబడుతోంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో తారక్ రాయలసీమ ఫ్యాక్షనిస్టు లీడర్’గా కనిపించబోతున్నట్టు చెబుతున్నారు. ఈ విషయం కాసేపు ప్రక్కన పెడితే.. త్రివిక్రమ్ ‘అ’ సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
జల్సా, జులాయి, ఖలేజా, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల విషయంలో త్రివిక్రమ్ ‘అ’ సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడు. ఐతే, వీటిలో మూడు సినిమాల్లో ‘జ’ సెంటిమెంట్ ని ఫాలో అయినట్టు అర్థమవుతోంది. ఈ లెక్కన త్రివిక్రమ్ అ, జ అక్షరాలతో మొదలయ్యే టైటిల్స్ బాగా ఇష్టపడతారని అర్థమవుతోంది. మరీ.. ఈ సారి తారక్ సినిమా విషయంలో అ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందేమో చూడాలి.