ఉప్పెన.. మెగా సెలబ్రేషన్స్ !

ఉప్పెన వ్యూహాం ఫలించింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్-కృతీ శెట్టి జంటగా నటించిన చిత్రమిది. వీరి ముగ్గురికి ఇదే తొలి సినిమా. కానీ ఓ స్టార్ హీరో సినిమా వస్తుందనే రేంజ్ లో ప్రమోషన్స్ కల్పించారు. ఉప్పెన నుంచి వచ్చిన తొలి పాట ‘నీ కళ్లు నీలి సముద్రం.. ‘ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దానికితోడు.. మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా హీరోలందరూ ఉప్పెనని ప్రమోట్ చేసారు. దీంతో థియేటర్స్ లో ఉప్పెన చూసేయాలని ప్రేక్షకులు ఫిక్సయిపోయారు. థియేటర్స్ కి క్యూ కట్టారు.

సినిమా టాక్ కూడా పాజిటివ్ గా వచ్చింది. దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్ అదిరిపోయాయ్. రికార్డ్ స్థాయిలో రూ. 10కోట్లకి పైగా కలక్ట్ చేసింది. దీంతో చిత్రబృందం హ్యాపీ. రిలీజైన మధ్యాహ్నం నుంచే సెలబ్రేషన్ మొదలెట్టారు. అవి ఇంకా కొనసాగుతున్నాయి. నిన్న మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి ఉప్పెన సినిమాని వీక్షించారు. వీరిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొడుకు అకీరానంద్ కూడా ఉన్నారు. ఇక ఇవాళ అదివారం కావడంతో.. ఉప్పెన మెగా సెలబ్రేషన్స్  జరిగాయి. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఉప్పెన టీమ్ సెలబ్రేట్ చేసుకుంది. ఉప్పెన టీమ్ ని చిరు అభినందించారు. ఉప్పెన మెగా సెలబ్రేషన్స్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.