అక్షర్.. అదరగొట్టాడు !
రెండో టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా 317 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టుని ఓడించింది. సిరీస్ 1-1గా సమం చేసింది. ఈ టెస్ట్ లో టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 329 పరుగులు చేసింది. ఇక తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టుని 134 పరుగులకే కట్టడి చేసింది. ఆపై రెండో ఇన్నింగ్స్ లో స్పిన్నర్ అశ్విన్ సెంచరీ చేయడంతో టీమిండియా 286 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ ముందు 482 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
482 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో తడబడింది. 164 పరుగులకే కుప్పకూలింది. తొలి టెస్ట్ ఆడిన టీమిండియా స్పిన్నర్ అక్షర్ 5 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ని అవుట్ చేసిన అక్షర్.. రెండో ఇన్నింగ్స్ లోనూ అతడిని అక్షర్ నే అవుట్ చేయడం విశేషం. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో అక్షర్ రెండు కీలక వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. మొత్తంగా.. రెండో టెస్ట్ లో అక్షర్ పటేల్ టీమిండియా ప్లస్ అయ్యాడు. అదే సమయంలో మరో స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అతడికి 2 వికెట్లు దక్కినా… మునుపటి పదను కనిపించలేదు.
ఇక స్పిన్ అనుకూల పిచ్‌లను విమర్శించేవారిపై అక్షర్ పటేల్ గట్టిసమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. విదేశాలకు వెళ్లినప్పుడు పచ్చికతో కూడిన పిచ్‌లపై భారత జట్టు ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదన్నాడు. ‘మీరు పిచ్ గురించి మాట్లాడినట్టైతే ఒక్క బంతి సైతం హెల్మెట్‌కు తాకలేదు. టర్న్ సాధారణంగానే ఉంది. మేమూ అదే పిచ్‌పై ఆడుతూ పరుగులు చేశాం. దాంతో ఎవరికీ సమస్య ఉంటుందనుకోం. ఇంకా చెప్పాలంటే విదేశాల్లో మేం పర్యటిస్తున్నప్పుడు సీమింగ్ పిచ్‌లపై ఎక్కువ పచ్చిక ఉన్నప్పుడు అస్సలు ఫిర్యాదు చేయలేదు. అందుకే వికెట్‌పై అతిగా ఆలోచించడం మానేసి వైఖరి మార్చుకుంటే బాగుంటుందని చురకలంటించాడు.