#IPL వేలం : ఏ జట్టుతో చేతిలో ఎంత డబ్బు ఉందంటే ?

మరికొద్దిసేపట్లో ఐపీఎల్-14 కోసం వేలం పాట ప్రారంభం కానుంది. దీంతో 2021 సీజన్‌కు ఆయా ఫ్రాంఛైజీలు కొత్తగా ఎవరెవరిని కొనుగోలు చేస్తున్నాయనే అంశంపై ఆసక్తి మొదలైంది. అయితే, అంతకన్నా ముందు ఆ ఫ్రాంఛైజీల వద్ద తమ ఖాతాల్లో ఇంకెంత నగదు మిగిలి ఉందనేది ప్రధానాంశంగా మారింది. మరి ఏయే జట్టుతో ఎంత సొమ్ము ఉందో ఓ లుక్కేదాం పదండీ.. !

* చెన్నై సూపర్‌ కింగ్స్‌: 19 మంది ఉన్నారు. ఏడుగురు విదేశీయులు, 6 ఖాళీలు. మిగిలిన నగదు రూ.19.9 కోట్లు.

* దిల్లీ క్యాపిటల్స్‌: 17 మంది ఉన్నారు. ఐదుగురు విదేశీయులు, 8 ఖాళీలు. మిగిలిన నగదు రూ.13.4 కోట్లు.

* కింగ్స్‌ పంజాబ్‌: 16 మంది ఉన్నారు. ముగ్గురు విదేశీయులు, 9 ఖాళీలు. మిగిలిన నగదు రూ.53.2 కోట్లు.

* కోల్‌కతా నైట్‌ రైడర్స్‌: 17 మంది ఉన్నారు. ఆరుగురు విదేశీయులు, 8 ఖాళీలు. మిగిలిన నగదు రూ.10.75 కోట్లు.

* ముంబయి ఇండియన్స్‌: 18 మంది ఉన్నారు. నలుగురు విదేశీయులు, 7 ఖాళీలు. మిగిలిన నగదు రూ.15.35 కోట్లు.

* రాజస్థాన్‌ రాయల్స్‌: 16 మంది ఉన్నారు. ఐదుగురు విదేశీయులు, 9 ఖాళీలు. మిగిలిన నగదు రూ.37.85 కోట్లు.

* రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు: 14 మంది ఉన్నారు. ఐదుగురు విదేశీయులు, 11 ఖాళీలు. మిగిలిన నగదు రూ.35.4కోట్లు.

* సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: 22 మంది ఉన్నారు. ఏడుగురు విదేశీయులు, 3 ఖాళీలు. మిగిలిన నగదు రూ.10.75 కోట్లు.