మహారాష్ట్రలో మళ్లీ లాక్ డౌన్ ?
దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజే 4,787 కొత్త కేసులు నమోదయ్యాయ్. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. సీఎం ఉధ్ధవ్,ఆయన డిప్యూటీ అజిత్ పవార్ గురువారం అత్యవసర స మావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిని సమీక్షించారు. అవసరమైతే మూడు ప్రధాన నగరాల్లో ఏ క్షణమైన లాక్ డౌన్ విధించే అవకాశాలున్నాయని ఉద్దమ్ సంకేతాలిచ్చినట్టు తెలుస్తోంది.
ప్రజలు కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించని పక్షంలో వారు తిరిగి లాక్ డౌన్ పరిస్థితిని ఎదుర్కోవలసి రావచ్చునని ఉధ్ధవ్ ఇటీవలే హెచ్ఛరించారు. ప్రపంచ దేశాల్లో పలు చోట్ల మళ్ళీ ఈ విధమైన కఠిన ఆంక్షలను విధించారని ఆయన గుర్తు చేశారు. కేరళ నుంచి వచ్ఛే ప్రజలపై ట్రావెల్ ఆంక్షలను పొడిగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. మహారాష్ట్ర లోకి వచ్ఛే వారు తప్పనిసరిగా కోవిడ్ నెగెటివ్ రిపోర్టులను తీసుకురావాలని సూచించింది.