నాని నుంచి డబుల్ ట్రీట్.. రెడీనా ?

నేచురల్ స్టార్ నాని అభిమానులకి గుడ్ న్యూస్. ఆయన నుంచి అతి త్వరలోనే డబుల్ ట్రీట్ రానుంది. ఈ మేరకు నాని ట్విట్ చేశారు. యేడాది మూడ్నాలుగు సినిమాలు చేయడం నానికి అలవాటు. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడం కూడా చూశాం. ప్రస్తుతం నాని రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. శ్యామ్ సింగరాయ్, టక్ జగదీష్ సినిమాల్లో నటిస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాల అప్ డేట్స్ ఒకే సారి ఇవ్వనున్నాడట.

ఈ మేరకు నాని ట్విట్ చేశారు. #TuckJagadishTEASER, #ShyamSinghaRoyFIRSTLOOK రాబోతుంది. మీరు రెడీనా ? అంటూ నాని ట్విట్ చేశారు. దీంతో ఆయన అభిమానులు ఖుషి అయిపోతున్నారు. అభిమానులకి బ్యాక్ టు బ్యాక్ బహుమతులు ఇవ్వడం  నానికి అలవాటే. కానీ ఇలా రెండు ఒకేసారి ఇచ్చిన సందర్భాల్లేవ్. తొలిసారి నాని ఓ సినిమా టీజర్, మరో సినిమా ఫస్ట్ లుక్ తో ప్రేక్షకులని ఖుషి చేయబోతున్నారు అన్నమాట.