బన్నీ-కొరటాల సినిమా.. మొదలైంది !

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాతో బిజీగా ఉన్నారు. సుకుమార్-బన్నీ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో బన్నీకి జంటగా రష్మిక మందన నటిస్తోంది. మరో కీలక పాత్రలో ప్రముఖ నటుడు కనిపిస్తారని చెబుతున్నారు. అలాగే.. ఐటమ్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ మెరవనుందనే ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉండనుంది.

తాజాగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయ్. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే రెగ్యూలర్ షూటింగ్ మాత్రం పుష్ప రిలీజ్ తర్వాత ఉంటుందని తెలిపింది. ఆగస్టు 13న పుష్ప రిలీజ్ కానుంది. ఆ తర్వాత బన్నీ-కొరటాల సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలైంది. ఇఅక్ వచ్చే యేడాది సమ్మర్ కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.