బీజేపీని గెలిపించడమే కేసీఆర్ లక్ష్యం

రాజకీయ వ్యూహాలు పన్నడంలో కేసీఆర్ దిట్ట. ఆ వ్యూహాలతోనే తెలంగాణ సాధించిండు. తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి అయ్యిండు. రెండోసారి కూడా ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించిండు. ఆయన తర్వాత ఆయన తనయుడుని ముఖ్యమంత్రిని చేసేందుకు రెడీ అవుతుండు. అయితే, ఈ క్రమంలో సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వ్యూహాలు మాత్రం ఆశ్చార్యానికి గురి చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ముందు బీజేపీని టార్గెట్ చేసిన సీఎం కేసీఆర్.. ఆ తర్వాత మాత్రం సల్లబడ్డడు. ఢిల్లీకి వెళ్లి వంగి వంది దండాలు పెట్టొచ్చాడు. తిరిగి తెలంగాణకు వచ్చి.. కేంద్ర పథకాలని రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. అయితే కేంద్రంగాని దండుగా నిలవడం కేసీఆర్ కి కొత్తేమీ కాదు. గతంలోనూ చేశాడు. కేంద్రం తీసుకొచ్చిన ప్రతి పథకానికి సపోర్ట్ చేశాడు. అదే సమయంలో కేంద్రంలో నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తానని కూడా కోతలు కోశాడు. ఆ తర్వాత సలైండ్ అయ్యాడు అనుకోండి. అయితే ఇప్పుడు తెలంగాణలో భాజాపా బలపడేందుకు కేసీఆర్ సాయం చేస్తున్నారనే టాక్ మొదలైంది.

అది ఎలాగా అంటే ? వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టడం వెనక భాజాపా+కేసీఆర్ ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. అదీగాక… భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు కూతురు పీవీ వాణీకి తెరాస పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది. దీని వెనక తెలంగాణలో కాంగ్రెస్ ని ఓడించి.. భాజాపాని గెలిపించడమే కేసీఆర్ లక్షయమని చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే.. తెలంగాణలో భాజాపా గెలుపుకు, ఆ పార్టీ బలపడేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నట్టే భావించాలేమో.. !