మందు బాబులకి గుడ్ న్యూస్ చెప్పబోతున్న కేంద్రం
మందు బాబులకు కేంద్రం అతి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుంది. యూరప్ నుంచి దిగుమతి చేసుకున్న వైన్స్‌పై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. దీంతో.. విదేశీ బ్రాండ్స్ ధరలు తగ్గనున్నాయ్.
యూరప్ ఆల్కహాల్ బ్రాండ్స్‌పై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలనే యోచనలో కేంద్రం ఉంది. ప్రస్తుతం విదేశీ ఆల్కహాల్ ఉత్పత్తులపై కేంద్రం 150 శాతం కస్టమ్స్ డ్యూటీని విధిస్తోంది. దాన్ని 75 శాతానికే పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో.. విదేశీ మద్యం బ్రాండ్లు ఇప్పుడున్న ధర కంటే తక్కువగా దొరికే అవకాశం ఉంది.