వాలంటీర్లు.. జగన్ కీలక నిర్ణయం !
గ్రామ వాలంటిర్ల విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారిని సత్కరించనున్నారు. ఇటీవల వాలంటీర్లు వేతలు పెంచాలని ఆందోళనకి దిగిన సంగతి తెలిసిందే. అయితే వెంటనే ఆ ఆందోళనలపై స్పందించిన సీఎం జగన్ వారికి లేఖ రాశారు.
వాలంటీర్ అన్నది ఒక ఉద్యోగం కాదని సేవ అని గుర్తుంచుకోవాలి అంటూ లేఖలో పేర్కొన్నారు.
వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా సేవ అందించడం. ఇది ఉద్యోగం కాదని గుర్తు చేశారు. పేదవారి ఆశీస్సులు, దీవెనలు అందుకుంటూ జీవిస్తున్న కార్యక్రమం ఇది తెలిపారు. అయితే తాజాగా గ్రామ వాలంటీర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. ఉగాది రోజున వారిని సత్కరించే కార్యక్రమానికి కార్యాచరణ సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. వాలంటీర్ల సేవలను గుర్తించేలా ప్రోత్సాహకాలతో వారిని గౌరవించాలని స్పష్టం చేశారు. సేవారత్న, సేవామిత్ర.. పేరుతో ఇలా మంచి సేవలను అందించిన వాలంటీర్లను సత్కరించాలని నిర్ణయించారు.