తారక్’ని ఢీకొట్టనున్న విజయ్ సేతుపతి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం #ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో తారక్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. ఆయనకి జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఓలివియా మోరీస్ నటిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ సినిమా ఉండనుంది. కొద్దిరోజులుగా ఈ సినిమా కథ, టైటిల్, నటీనటుల వివరాలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి పేరు తెరపైకి వచ్చింది.

తారక్-త్రివిక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. ఇటీవల విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించిన ‘మాస్టర్‌’, ‘ఉప్పెన’ బ్లాక్‌బస్టర్‌ హిట్లు కొట్టాయి. దీంతో విజయ్‌ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. తన కథలో తారక్‌ను ఎదుర్కొనే విలన్‌గా ఇప్పుడున్న నటుల్లో విజయ్‌ సేతుపతి సరిగ్గా సరిపోతారనేది త్రివిక్రమ్ భావిస్తున్నట్టు తెలిసింది. త్వరలోనే త్రివిక్రమ్ విజయ్ ని కలుస్తారని కథని వినిపిస్తారని టాక్.