ఇంగ్లండ్ దారిలోనే.. కుప్పకూలిన భారత్ !
ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో తొలిరోజు టీమిండియా ఆదిపత్యం చెలాయించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ని 112 పరుగులకే కట్టడి చేసింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. ఓపెనర్ రోహిత్ శర్మ మెరుపులు మెరిపించడంతో పటిష్ట స్థితిలో కనిపించింది. తొలిరోజు ఆటముగిసే సమయాన్నికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయిన క్రీజులో.. రోహిత్ ఉండటంటో భారత్ భారీ స్కోర్ చేయడం ఖాయం అనుకున్నారు.
కానీ రెండో రోజు టీమిండియా ఇంగ్లండ్ తరహా కుప్పకూలింది. 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులతో ఆటని కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ 66 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. రెహానె 7, పంత్ 1, సుందర్ 0, అక్షర్ పటేల్ 0 నిరాశపరిచారు. ఇంగ్లండ్ స్పిన్నర్ లీచ్ 4 వికెట్ల పడగొట్టాడు. ప్రస్తుతం అశ్విన్ 16, ఇషాంత్ శర్మ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 21 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.