Breaking : IPL2021 షెడ్యూల్ విడుదల

ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్. ఐపీఎల్-2021 షెడ్యూల్ ని బీసీసీఐ విడుదల చేసింది. ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2021 మే 30న ముగియనుంది. ఈ సీజన్ లో కూడా మొత్తం 8 జట్లు పోటీ పడనున్నాయ్. అయితే వచ్చే యేడాది (ఐపీఎల్-2022)లో మాత్రం మరో జట్టు జత కలవనుంది. ఈ మేరకు బీసీసీఐ ఇప్పటికే అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. 


ఇటీవలే ఐపీఎల్ మినీ వేలం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో అన్ని జట్లు ప్రతిభగల ఆటగాళ కోసం ప్రయత్నించాయ్. విదేశీ ఆటగాళ్లని కోట్లు కుమ్మరించి మరీ.. కొనుకున్నాయ్. యువ ఆటగాళ్లని దక్కించుకున్నాయ్. గత సీజన్ లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సారి కప్ కొట్టాలనే కసితో అన్నీ జట్లు రెడీ అవుతున్నాయ్. మరీ.. ఐపీఎల్ 2021 విజేతగా ఏ జట్టు నిలవనుంది ? అన్నది చూడాలి.