చంద్రబాబు-రాహుల్ గాంధీ.. వాట్ ఏ సీన్ !
కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేదికపై కొన్ని షాకింగ్ సీన్స్ చూసే అవకాశం తెలుగు ప్రజలకు కలిగింది. ఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం ముఖ్యమంత్రి కలుసుకొన్న సీన్ హైలైట్ అయ్యింది. చంద్రబాబు కాంగ్రెస్ వ్యతిరేకి. తన జీవితాంతం కాంగ్రెస్’కు వ్యతిరేకంగా పోరాడతానని బాబు పలుమార్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు కాంగ్రెస్’పై బాబుకు కోపం తగ్గినట్టయ్యింది. ఇటీవలే టీడీపీ ఎన్డీయే కూటమి నుంచి బయటికొచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ భాజాపాకు ఢిల్లీ పీఠం దక్కకుండా బాబు ప్రయత్నాలు మొదలెట్టినట్టు పొలిటికల్ సర్కిల్స్ లోవినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ ను కలుపుకొని థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు చెబుతున్నారు. ఇందులో భాగంగానే అసలు పడని కాంగ్రెస్ ని, ముద్దపప్పు అంటూ హేళన చేసిన రాహుల్ గాంధీకి బాబు దగ్గరయ్యాడు
బెంగళూరు సీన్ లో రాహుల్ గాంధీ భుజంపై చేయి వేసి మరీ పలుకరించారు బాబు. ముందుగా ఇరువురు నేతలూ కరచాలనం చేసుకున్నారు. అనంతరం కుమార స్వామి ప్రమాణ స్వీకారానికి హాజరైన నేతలంతా ప్రజలకు అభివాదం చేసి వెళ్లిపోయే సమయంలో మరోసారి రాహుల్ గాంధీ, చంద్రబాబు ఎదురుపడ్డారు. ఆ సందర్భంగా చంద్రబాబు రాహుల్ భుజంపై చేయి వేసి కరచాలనం చేశారు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు అంటే ఇదేనేమో.. !