‘హరి హర వీరమల్లు’ ఫస్ట్ గ్లింఫ్స్.. అదిరిపోయింది !

క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమా ‘హరి హర వీరమల్లు’. మహా శివరాత్రి కానుకగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. సింగిల్ సీన్ తో వీరమల్లు వీరత్వం చూపించాడు క్రిష్. ప‌వ‌న్ క‌ల్యాణ్ బిల్డింగ్ పై నుంచి నౌక‌వైపు జంప్ చేస్తూ ఎంట్రీ ఇస్తున్న సీన్ రొమాలు నిక్క‌పొడుచుకునేలా ఉంది. 17వ శతాబ్దం బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్క‌నున్న ఈ ప్రాజెక్టును ఏఎం ర‌త్నం నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఈ సినిమాలో పవన్ బందీపోటుగా.. వ‌జ్రాల దొంగ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌‌ని సమాచారమ్. పవన్ కి జోడిగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నిధి అగ‌ర్వాల్ నటిస్తున్నారు.  బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్  ఔరంగ‌జేబు పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు తెలిసింది. పిరియాడికల్ డ్రామాలో పవన్ నటించడం ఇదే తొలిసారి. ఈ సినిమా కోసం పవన్ ని క్రిష్ పట్టుబట్టి మరీ ఒప్పించారని సమాచారమ్. ఇందుకోసం క్రిష్ మెగాస్టార్ చిరంజీవి రికమెండేషన్ ని కూడా వాడుకున్నారట.