డేంజర్ : మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. మరోసారిలాక్‌డౌన్ తప్పదా ?
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 23,285 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ ఏడాదిలో 23వేల పైన కేసులు నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆ మధ్య 9లాక్డౌన్7శాతం దాటిన రికవరీ రేటు.. ప్రస్తుతం 96.86శాతానికి పడిపోయింది. రికవరీలు తగ్గుముఖం పట్టడంతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య మళ్లీ 2లక్షలకు చేరువైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,97,237 యాక్టివ్ కేసులున్నాయి. క్రియాశీల రేటు 1.74శాతానికి పెరిగింది. ఇక 24 గంటల వ్యవధిలో మరో 117 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 1,58,306కు పెరిగింది.
మహారాష్ట్రలో పరిస్థితి నానాటికీ ఆందోళనకరంగా మారుతోంది. ఆ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. గురువారం ఒక్కరోజే అక్కడ 14,317 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 22,66,374కు పెరిగింది. ఇక నిన్న మరో 57 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే నాగ్‌పూర్‌లో లాక్డౌన్ విధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. మరిన్ని నగరాల్లోనూ లాక్డౌన్ విధించే ఆలోచనలో మహారాష్ట్ర ప్రభుత్వం ఉంది.
ఇక తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 181 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఒకరు మరణించారు. కరోనా బారి నుంచి నిన్న 163 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,872 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 733 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.