ధోని సిక్సుల వర్షం

మహేంద్ర సింగ్ ధోని క్రీజులో ఉంటే విజయంపై నో డౌటు. అయితే అంతర్జాతీయ  క్రికెట్ లో ధోని కాలం ముగిసింది. అంతర్జాతీయ క్రికెట్‌కు గతేడాదియే ధోని రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ లో ధోని మెరుపులు చూసే అవకాశం ఉంది. ఐపీఎల్‌ 13వ సీజన్‌లో మాత్రం ధోని పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో వచ్చేనెలలో ప్రారంభమయ్యే మెగా ఈవెంట్‌లో బ్యాట్‌ ఝుళిపించాలని తీవ్రంగా మహీ సాధన మొదలెట్టాడు.


మహీ తాజాగా ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో బ్యాట్‌పట్టిన తొలిరోజే మైదానంలో సిక్సుల వర్షం కురిపించాడు. ప్రాక్టీస్‌ సందర్భంగా ధోనీ పలు బంతులను స్టాండ్స్‌లోకి తరలించిన వీడియోను ఆ జట్టు సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకుంది. ఇప్పుడీ.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మునుపటి ధోని కనిపించాడు. ఈ సారి చెన్నై అదరగొట్టడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. 

Mahi way all the way!!! 👀 on #Thala #WhistlePodu #Yellove 💛🦁 pic.twitter.com/gU1TRD2ZP9— Chennai Super Kings (@ChennaiIPL) March 11, 2021