బుమ్రా పెళ్లి ఫిక్స్.. అనుమప రియాక్షన్ ఏంటంటే ?
టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పెళ్లి ఫిక్సయింది. మోడల్, యాంకర్ సంజనా గణేష్ ని బుమ్రా పెళ్లాడనున్నాడు. ఈ నెల 14 లేదా 15న గోవాలో వీరి పెళ్లి. చాలా సింపుల్ గా పెళ్లి జరగనుంది. కుటుంబ వేడుకగా ప్లాన్ చేశారు అనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి బుమ్రా మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ తో ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే సడెన్ గా సంజనా గణేష్ తో బుమ్రా పెళ్లి ఫిక్స్ అంటూ పెళ్లి డేటు రావడంతో అంతా షాక్ అవుతున్నారు. మరీ.. ఈ ప్రచారంలో నిజమెంత ? అంటే.. ఇప్పటి వరకు పెళ్లిపై అటు బుమ్రా గానీ ఇటు సంజనా కానీ నోరు మెదపలేదు. ఇక బుమ్రాతోప్రేమలో పడినట్టు ప్రచారం జరుగుతున్న అనుపమ కూడా సలైంట్ గా ఉన్నారు. అయితే ఆమె అభిమానులు మాత్రం ఇదంతా ఉత్తిత్తి ప్రచారమే. సంజనా కంటే అమపనే బుమ్రాకి సరిజోడి అని చెప్పుకుంటున్నారు. మొత్తానికి.. బుమ్రా పెళ్లి మేటరు హాట్ టాపిక్ గా మారింది.
వ్యక్తిగతీ కారణాలంటూ ఇంగ్లండ్ తో చివరి టెస్టు నుంచి బుమ్రా తప్పుకున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ రెండు టీ20లకూ అతడు అందుబాటులో లేడు. దీంతో పెళ్లి కోసమే అతడు సెలవు పెట్టాడని, టాలీవుడ్ భామ అనుపమ పరమేశ్వరన్ ను పెళ్లాడబోతున్నాడని పుకార్లు పుట్టాయి. దీంతో అనుపమ తల్లి ఆ పుకార్లను కొట్టిపారేశారు. అందులో ఎలాంటి వాస్తవమూ లేదని చెప్పారు. ఇంతలో సంజనా గణేశ్ పేరు తెరపైకి రావడం.. పెళ్లి డేటు కూడా వచ్చేసింది. మరీ.. ఈ ప్రచారం నిజమవుతుందేమో చూడాలి.