పంత్ స్టన్నింగ్ షాట్.. క్రికెట్ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం !

ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టీ20లో ఆదిలోనే టీమిండియా తడబడింది. పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయి 21 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు కె ఎల్ రాహుల్ (1), ధావన్ (3) పరుగులకే పెలివియన్ చేరారు. కెప్టెన్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఖాతా కూడా తెరవకుండానే అవుట్ అయ్యాడు. ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా రిషబ్ పంత్ మాత్రం తనదైన మార్క్ షాట్స్ తో అలరించాడు. ఆర్చర్ బౌలింగ్ లో పంత్ కొట్టిన సిక్స్ మ్యాచ్ కే హైలైట్ గా నిలవనుంది.

అయితే ఆ తర్వాత కాస్త నెమ్మదించిన పంత్ నిలదొక్కుకొనేందుకు ప్రయత్నించారు. అయ్యర్ తో కలిసి భాగస్వామ్యం పెంచే పని చేశాడు. అయితే 9 ఓవర్ లో స్టోక్స్ వేసిన బౌలింగ్ భారీ షాక్ కి ప్రయత్నించి పంత్ (21) అవుటయ్యాడు. 11 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో అయ్యర్ (29), హార్ధిక్ పంత్ (0) పరుగులతో క్రీజులో ఉన్నారు.

Rishabh Pant is just built different. First that six against Anderson on the new ball and now against Jofra Archer. Syringe.
well-done Pant keep it up….#INDvEND #INDvsENG pic.twitter.com/sRuOiivyXU— Kamal Sarkar (@KamalSa77705532) March 12, 2021