#RowdyBaby టైటిల్ మారనుంది. ఎందుకంటే.. ?

#RowdyBaby సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఈ పాటలో ధనుష్-సాయి పల్లవి కలిసి వేసిన స్టెప్పులకి ప్రేక్షకులకి ఫిదా అయ్యారు. అయితే #RowdyBaby పాపులారిటీని వాడుకోవాలని ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ భావించారు. ఆయన నిర్మాణంలో జి. నాగేశ్వరెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ నటించనున్న సినిమా కోసం #RowdyBaby టైటిల్ ని ఫిక్స్ చేశారు. అయితే ఇప్పుడీ.. ఈ టైటిల్ ని మారుస్తున్నట్టు కోన వెంకట్ ట్విట్ చేశారు.

టెక్నికల్ కారణాల వలన టైటిని మారుస్తున్నాం. #RowdyBaby కంటే ఆసక్తికర టైటిల్ ని పెట్టబోతున్నామని తెలిపారు. సెర్చ్ ఇంజన్ లో #RowdyBaby కొడితే.. ధనుష్-సాయి పల్లవిల పాటకు సంబంధించిన అప్ డేట్స్ మాత్రమే వస్తున్నాయ్. సందీప్ కిషన్ సినిమా అప్ డేటు ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే టైటిల్ ని మార్చాలని చిత్రబృందం భావిస్తున్నట్టు సమాచారమ్. ఈ సినిమాలో సందీప్ కిషన్ కి జంటగా నేహాశెట్టి జతకట్టనున్నారు. 

We @KonaFilmCorp informing you all that, due to some technical issues we are changing our title from #RowdyBaby to a more interesting Title.
Full details will be announced soon..@sundeepkishan @actorSimha #NehaShetty #GNageswaraReddy @konavenkat99 @OfficialMvv @MVVCinema_— KonaFilmCorporation (@KonaFilmCorp) March 13, 2021