అందుకే రోహిత్ ని పక్కన పెట్టారా ?
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఆడలేదు. అతడి స్థానంలో కె ఎల్ రాహుల్ ని తీసుకున్నారు. రోహిత్ కి విశ్రాంతి ఇచ్చినట్టు కెప్టెన్ కోహ్లీ తెలిపారు. అయితే దీని వెకన టీ20 ప్రపంచకప్ కి సన్నద్ధం అవ్వడం ఉందని తెలిసింది. రొటేషన్ పద్ధతిలో భాగంగా హిట్‌మ్యాన్‌కు విశ్రాంతినిచ్చారని తర్వాత తెలిసింది.
ప్రపంచకప్ దిశగా సన్నాహాలు మొదలుపెట్టిన భారత్.. ఎక్కువ మంది ఆటగాళ్లను పరీక్షించే ఉద్దేశంతో రొటేషన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే తొలి మ్యాచ్‌కు రోహిత్‌ను దూరం పెట్టింది. రొటేషన్‌లో భాగంగా తర్వాతి మ్యాచ్‌ల్లో మరికొందరు ఆటగాళ్లు విశ్రాంతి తీసుకునే అవకాశముంది. రాబోయే మ్యాచ్‌ల్లో యువ ఆటగాళ్లకు ఛాన్సులు రావడం ఖాయం. అయితే తొలి టీ20లో రోహిత్ లేకపోవడం టీమిండియాకు పెద్ద మైనస్ గా మారింది. భారీ మూల్యం చెల్లించక తప్పలేదు. ఇంగ్లండ్ చేతులో టీమిండియా ఘోరంగా ఓడింది.
టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.ఆపై ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయి అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. 15.3 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేశారు. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0 ఆదిక్యం సంపాదించింది.