రెండో టీ20 : రోహిత్ ఇన్.. ధావన్’కు రెస్ట్ !
తొలి టీ20లో టీమిండియాకు ఇంగ్లండ్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ ఈజీగా గెలిచేసింది. సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో రెండో టీ20లో గెలిచి ఇంగ్లండ్ ఆధిక్యాన్ని సమం చేయాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. ఇక తొలి మ్యాచ్ లో ఓపెనర్ రోహిత్ శర్మని పక్కన పెట్టడంపై తీవ్ర విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే. మంచి ఫామ్ లో ఉన్న రోహిత్ ని పక్కనపెట్టడమేంటన్ని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో నేడు జరగనున్న రెండో టీ20 కోసం రోహిత్ శర్మ ని తీసుకోనున్నారని తెలిసింది. రోహిత్-రాహుల్ ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్ లో ధావన్ కి రెస్ట్ ఇవ్వొచ్చు. అటు బౌలింగ్ కూర్పుపైనా కసరత్తులు చేయనున్నారు. యజువేంద్ర చాహల్, శార్దూల్ ఠాకూర్ స్థానంలో చహర్ బ్రదర్స్ (దీపక్, రాహుల్)లకు తుదిజట్టులో స్థానం దక్కే అవకాశాలున్నాయి.