టీమిండియా లెక్క సరిచేసింది
ఇంగ్లండ్ జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. సిరీస్ తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత బలంగా పుంజుకున్న టీమ్ఇండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. కోహ్లీసేన లెక్క సరిచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది.
ఓపెనర్ రాయ్ (46; 35 బంతుల్లో 4×4, 2×6) ఫామ్ కొనసాగించాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ (2/29), శార్దూల్ ఠాకూర్ (2/29) సత్తా చాటారు. ఛేదనలో కోహ్లి (73 నాటౌట్; 49 బంతుల్లో 5×4, 3×6), అరంగేట్ర ఓపెనర్ ఇషాన్ (56; 32 బంతుల్లో 5×4, 4×6) అర్ధశతకాలతో జట్టును విజయతీరాలకు చేర్చారు. 3 వికెట్లు కోల్పోయిన భారత్ 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్‌తో ఇషాన్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.