ఘనంగా బుమ్రా-సంజనా గణేష్’ల వివాహం

టీమిండియా పేసర్ బుమ్రా ఓ ఇంటివాడు అయ్యాడు. స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్ ని పెళ్లాడాడు. వీరి వివాహం ఈరోజు ఘనంగా జరిగింది. తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను బుమ్రా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. “మీరు ప్రేమ విలువను గుర్తిస్తే మీరెటు వెళ్లాలో అదే నిర్ణయిస్తుంది. ప్రేమ మాకు చూపించిన దారిలో మేం నడిచాం… జంటగా కొత్త జీవితాన్ని ప్రారంభించాం. ఇది మా జీవితాల్లో ఒక అత్యంత సంతోషకరమైన దినాల్లో ఒకటి. మా పెళ్లి వార్తను మీతో పంచుకుంటున్నందుకు ధన్యులం అయ్యామనుకుంటున్నాం… ఇట్లు మీ బుమ్రా, సంజన” అంటూ బుమ్రా ట్వీట్ చేశాడు.

సంజనా గణేష్ తో బుమ్రా చాలా సిక్రెట్ గా ప్రేమాయణం నడిపారు. అంతకుముందు టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో బుమ్రాని లింకు పెట్టి ప్రచారం జరిగింది. వీరిద్దరు ప్రేమలో ఉన్నారు. పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి. అయితే సడెన్ గా సంజనా గణేష్ పేరు తెరపైకి వచ్చింది. వారం తిరిగేలోగా ఈ ప్రేమ జంట పెళ్లి పీఠలు కూడా ఎక్కింది.