చంద్రబాబుకు సీఐడీ నోటీసులు

ఏపీ మాజీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకి సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి అమరావతి నుంచి ఏపీ సీఐడీ అధికారులు ఈ ఉదయం వెళ్లారు. చంద్రబాబుకు నోటీసులు అందించారు. అమరావతిలో అసైన్డ్‌ భూముల కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో విచారణకు సంబంధించి ఈ నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది. విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది.


అమరావతి భూ వ్యవహారంలో చంద్రబాబు, అప్పటి మంత్రులని అరెస్ట్ చేయించాలనే పంతంతో సీఎం జగన్ ఉన్నట్టు గతంలోనే కథనాలు వచ్చాయి. ఇందుకోసమే సీఎం జగన్ పలుమార్లు ఢిల్లీ వెళ్లేవారనే టాక్ కూడా ఉంది. ఫైనల్ గా రాజధాని భూ వ్యవహారంలో ఇప్పుడు జగన్ యాక్షన్ ప్లాన్ ని అమలు చేస్తున్నారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు కూడా సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారని సమాచారమ్.