కోహ్లీ సేన మా వీక్ నెస్ పై కొట్టింది
తొలి టీ20లో పులుల్లా గర్జించారు ఇంగ్లండ్ ఆటగాళ్లు. అవే పులులు రెండో టీ20లో పిల్లుల్లా మారిపోయారు. దీనికి కారణం పిచ్ అంటున్నారు ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్. ‘మొదటి మ్యాచ్ లో పిచ్ మాకు బాగా నప్పింది. ఎందుకంటే అందులో చక్కని వేగం ఉంది. ఇంగ్లాండ్‌లోని కార్డిఫ్ పిచ్‌లా అనిపించింది. కానీ ఈ పిచ్ మాత్రం మమ్మల్ని సౌకర్యవంతమైన జోన్ నుంచి బయటపడేసింది. ఐపీఎల్‌లో ఆడే వికెట్‌లా అనిపించింది.
ఏదేమైనా మేం మరింత కచ్చితత్వంతో ఆడాలి. వేగంగా నేర్చుకోవాలి. తొలుత మా ఇన్నింగ్స్‌ను అనుకున్నట్టే ఆరంభించాం. భాగస్వామ్యాలు నెలకొల్పాం. దూకుడు పెంచే క్రమంలో వివిధ దశల్లో వికెట్లు చేజార్చుకున్నాం. ఛేదనలో త్వరగా వికెట్ తీయడం తెలివైన పనే. కానీ టీమ్‌ఇండియా బలంగా పుంజుకుంది. కోహ్లీ, కిషన్ దూకుడుగా ఆడి మాపై ఆధిపత్యం చెలాయించారు. వారిపై మా ప్రయత్నాలు వృథానే అయ్యాయి’ అని మోర్గాన్ అభిప్రాయపడ్డాడు. ఇక ఈరోజు మూడో టీ20 జరగనుంది. ఇందులో గెలిచి టోర్నీని ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని రెండు జట్లు భావిస్తున్నాయి.