తారక్’కు వైసీపీ ఆహ్వానం
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. తారక్ రాజకీయాల్లోకి రావాలని, ఆయన వస్తేనే తెదేపా బతికి బట్టకడుతుందనే కామెంట్స్ జనాల నుంచి ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయ్. చంద్రబాబుకు వయసైపోతుంది. ఆయన వ్యూహాల పదును కూడా తగ్గింది. ఆయన తనయుడు లోకేష్ లో మేటరు లేదు. రాజకీయాలపై ఆయనకు పట్టులేదు. ఈ నేపథ్యంలో తెదేపా నడిపించే శక్తి-సామర్థ్యాలు తారక్ కు మాత్రమే ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయ్.
తెదేపా కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు మాత్రమే కాదే.. ఏపీలోని అధికార పార్టీ వైసీపీ నేతలు కూడా ఎన్టీఆర్ రాజకీయాల్లో రావాలని కోరుకుంటున్నారు. ఆయన్ని ఆహ్వానిస్తున్నారు. ఇటీవల ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రెస్ మీట్ లో పాల్గొన్న తారక్ కి పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్న ఎదురైన సంగతి తెలిసిందే. దానికి ఇది సమయం కాదు. సందర్భం కాదని తారక్ సమాధానం ఇచ్చారు.
అయితే తాజాగా తారక్ ని రాజకీయాల్లోకి ఆహ్వానించారు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో టీడీపీ క్లోజ్ అయిందని బాలినేని.. తెలుగుదేశం పార్టీ ఉనికి కాపాడుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్‌తో సాధ్యమని అన్నారు. లోకేశ్ వల్ల టీడీపీకి ఎటువంటి లాభం లేదన్నారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే టీడీపీ నిలబడుతుందని చెప్పుకొచ్చారు. బాలినేని కామెంట్స్ ని చూస్తే.. తారక్ ని వైసీపీ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించినట్టు ఉందని జనాలు చెప్పుకుంటున్నారు.